విద్యార్థులు కళాశాలలను విజ్ఞతతో ఎంపిక చేసుకోవాలి

* ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి

UPDATED 30th DECEMBER 2020 WEDNESDAY 6:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): ఇంజనీరింగ్ విద్యను అభ్యసించబోయే విద్యార్థులు కళాశాలలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 యావత్ ప్రపంచంలోని అన్ని రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని, దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది జీవితాలను సైతం తీవ్రంగా కృంగదీసిందని అన్నారు. గత ఆగస్టు నెల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి ఎట్టకేలకు తేదీలు ఖరారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించబోయే విద్యార్థులు తాము చేరనున్న కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు మౌలిక వసతులు, తదితర అంశాలను తొలుతగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు విజ్ఞతతో సరైన కళాశాల, బ్రాంచ్ లను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads