ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా ర్యాలీ

UPDATED 1st NOVEMBER 2019 FRIDAY 9:00 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, ఈఓపీఆర్డీ కె.వి. సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగించడం నివారించాలని కోరారు. గ్రామంలో పర్యటించి ప్రతీ ఇంటింటికీ, షాపులకు వెళ్లి  ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్ధాలు గురించి వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిర, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads