ఫైలేరియా నివారణా మందులు పంపిణీకి చర్యలు

UPDATED 7th FEBRUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ఫైలేరియా వ్యాధిని నివారించేందుకు మందులు పంపిణీ చేయాలని హెల్త్ ఇనస్ట్రక్టర్ జి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈనెల 10న జాతీయ బోదవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక మెప్మా కార్యాలయంలో బోదవ్యాధి నివారణపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ బోదవ్యాధి గురించి, ఎలా వ్యాపిస్తుందో అవగాహన కల్పించాలని, అలాగే  డిఈసీ, ఆల్బెండాజోల్ మందులు వినియోగంతో  బోదవ్యాధి నిరోధం ఎలా జరుగుతుందో వివరించాలని అన్నారు. ఈ మందులు సామర్లకోట పట్టణ పరిధిలోని 270 మంది వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే 21 మంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads