శ్రీరామదాస్ పేపర్ మిల్ సందర్శించిన ఆదిత్య విద్యార్థులు

UPDATED 16th MARCH 2021 TUESDAY 12.30 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్ కు చెందిన ప్రథమ సంవత్సరం    బిబిఎ విద్యార్థులు కడియంలో గల శ్రీరామదాస్ పేపర్ మిల్ సందర్శించినట్లు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఈ క్షేత్ర పరిశీలన ద్వారా పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అన్వయించుకొని ఉజ్జ్వలమైన ప్రగతికి బాటలు వేసుకోవాలని అన్నారు. నేటి  పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు పుస్తక పఠనాజ్ఞానమే కాకుండా ఇలాంటి క్షేత్ర పరిశీలనలు ఎంతగానో సహకరిస్తాయని తెలిపారు. ఇలాంటి పారిశ్రామిక సందర్శనలతో క్షేత్ర స్థాయిలో రోజువారీ కార్యక్రమాలను స్వయంగా  తెలుసుకొని అవగాహన పెంపొందించుకునేందుకు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యక్ష పరిశీలనతో మరింత విశ్లేషణాత్మక జ్ఞానం పొందడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని, తాము ఎంచుకొన్న రంగంలో విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాకల్టీ  వి. అప్పలకొండ, రేణుక, విద్యార్థినీ,  విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads