ఈ-సెట్ లో ఆదిత్య ర్యాంకుల ప్రభంజనం

UPDATED 13th MAY 2019 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల చెందిన విద్యార్థులు ఏపిఈ-సెట్- 2019 పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-సెట్- 2019 పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 2,3,12 మొదలైన 50లోపు 15 ర్యాంకులు,100 లోపు 25 ర్యాంకులు తమ సంస్థ విద్యార్థులు కైవసం చేసుకొన్నారని తెలిపారు. తమ సంస్థ విద్యార్థులు పి. వినయ్ (రెండవ ర్యాంక్), కె. జ్యోత్స్న (మూడవ ర్యాంక్) కంప్యూటర్ విభాగంలో సాధించారని, అలాగే  సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం విభాగాలలో రాష్ట్రస్థాయిలో 12,18, 21, 26, 28, 35, 38, 38, 41, 41, 43, 46, 50 ర్యాంకులు సాధించి విజయ దుంధుభి మ్రోగించారని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.టి.ఎస్.వి. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎవి మాధవరావు, తదితరులు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులను అభినందించారు.

 

ads