శృంగారవల్లభస్వామికి అవమానం

* స్వామివారి క్యాలెండర్ ఆవిష్కరణలో చెప్పులు ధరించిన ఈవో
* అపచారం చేశారంటూ పలువురు విమర్శలు
* పట్టించుకోని దేవస్థానం ఈవో

UPDATED 4th JANUARY 2021 MONDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తొలి తిరుపతిగా పేరు పొందిన పెద్దాపురం మండలం తిరుపతి శృంగారవల్లభస్వామి వారికి అవమానం జరిగింది. సాక్షాత్తూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ స్వామి వారిని అవమానపరిచే విధంగా వ్యవహరించారని పలువురు ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఈనెల 4వ తేదీన  వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నివాసం వద్ద ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరింపచేసే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దొరబాబుతో సహా అర్చకులు, పార్టీ కార్యకర్తలు తమ కాళ్ళకి ఉన్న చెప్పులను తీసివేసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అయితే నేనే కదా దేవస్థానం కార్యనిర్వహణాధికారిని అనే అహంకారమో లేక దేవుడు తనని ఏం చేస్తాడులే అనే గర్వమో తెలియదు కానీ ఆయన మాత్రం కాళ్లకి చెప్పులు ధరించి స్వామి వారిని అవమానపరిచే విధంగా స్వామివారి చిత్రంతో ఉన్న క్యాలెండర్ ను ప్రదర్శించారు. దేవాలయాల ప్రతిష్టను, ఆలయ మర్యాదలను కాపాడవలసిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఇలా చేస్తే ఎలా అని ఆయన తీరును పలువురు విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై దేవస్థానం ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు.

 

 

ads