ప్రజావాణికి ఏడు అర్జీలు

UPDATED 10th JUNE 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు  అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో పంట భూములు సర్వే చేయించమని మూడు, ఉపాధి హామీ పనులు క్రింద పంట కాలువను అభివృద్ధి చేయమని ఒకటి, సాగునీటి కాలువ నీరు నిలుపుదల చేస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఒకటి, మానసిక వికలాంగులకు ప్రభుత్వ సహకారం అందించమని ఒకటి, పంట కాలువపై తలెత్తిన సమస్యను పరిష్కరించాలని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. గోపాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు. 

ads