భీమేశ్వరస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 11th MARCH 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయానికి రూ.15,23,985 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి తెలిపారు. స్వామివారి హుండీలు లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మూడు నెలలుగా స్వామివారికి వచ్చిన ఆదాయం, అలాగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అభిషేకం, తదితర టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.6,41,651, హుండీల ద్వారా రూ.8,82,334 వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,68,985 పెరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకటగణేష్, గుమస్తా భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

ads