సెట్రాజ్ సీఈవోగా భానుప్రకాష్

కాకినాడ, 15 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): సెట్రాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా జిల్లాకు చెందిన ఎం.భానుప్రకాష్ నియమితులయ్యారు. ఏడాది పాటు డిప్యూటేషన్ పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీడీవోగా ఆయన జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేశారు. కొంత కాలం నుంచి ఫారిన్ సర్వీస్ పై డ్వామా పీడీ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నారు. రెండేళ్ల నుంచి సెట్రాజ్ కు రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో భాను ప్రకాష్ ఆ పోస్టులో పనిచేయడానికి చేసిన దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సీఈవోగా అవకాశం కల్పించింది.
ads