వెటర్నరీ డాక్టర్‌ హత్య హేయం

* వైద్యురాలు ఘటనపై పెల్లుబికిన నిరసనలు
* నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

UPDATED 1st DECEMBER 2019 SUNDAY 9:00 PM 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): మంచి భవిష్యత్తు ఉన్న వెటర్నరీ వైద్యురాలను మానవ మృగాలు చిదిమేయడంతో ఆగ్రహం పెల్లుబికింది. తెలంగాణా రాష్ట్రం శంషాబాద్‌ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శంకర్ కరాటే పాఠశాల విద్యార్థులు పట్టణంలో ఆదివారం నిరసన చేపట్టారు. కరాటే కోచ్ డి.శంకరరావు ఆధ్వర్యంలో  స్థానిక డీఎస్ఏ క్లబ్ కరాటే పాఠశాల నుంచి విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి రింగ్ సెంటర్ వరకు నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కరాటే కోచ్ శంకర్, నవభారత్ వెంచర్స్ ప్రతినిధి వెంకటరమణ మాట్లాడుతూ రోజురోజుకు బాలికలు, మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్ననేపథ్యంలో దేశంలో చట్టాలను కఠినం చేయాలని, ఇతర దేశాల్లో మాదిరిగా ఇలాంటి దురాగతాలకు అల్లరిమూకలు భయపడే విధంగా తక్షణం కఠినమైన శిక్షలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆత్మ రక్షణకు సంబంధించి ప్రత్యేక కోర్సులు, ప్రత్యేక తరగతులు నిర్వహించి బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి అది పునరావతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే క్రీడలో ఉత్తమ అవార్డు గ్రహీత బొడ్డు సుప్రియ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు బి. సత్యనారాయణ, ఎం. లొవరాజు, జి. జాన్ విల్సన్, నవభారత్ వెంచర్స్ ప్రతినిధి గోపు వెంకటేశ్వరరావు, టాక్సీ స్టాండు అధ్యక్షులు తలారి వెంకట రమణ, బి. రామారావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads