ఏప్రిల్‌ 6న నవోదయ ప్రవేశ పరీక్ష

UPDATED 6th MARCH 2019 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్‌ నెల 6వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ  ప్రిన్సిపాల్ డాక్టర్‌ వి. ముని రామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 44 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 10.30 గంటల్లోగా హాజరు కావాలని, విద్యార్థులు తమ హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు 9849778513, 8639562572, 7036550506 నెంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.  

ads