బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి

UPDATED 11th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు ఢీకొని పట్టణానికి చెందిన వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పాత తహసీల్దారు కార్యాలయం ప్రాంతానికి చెందిన మువ్వ సత్యవతి(80) శనివారం ఉదయం కాకినాడలో ఉంటున్న కుమారుని ఇంటికి వెళ్ళడానికి బస్సు కాంప్లెక్ కు చేరుకుంది. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు వద్ద దొరికిన సంచిలో ఉన్న పుస్తకం ఆధారంగా బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కిషోర్ ప్రమాద స్థితిని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ads