ఎరువుల దుకాణాలపై విజిలెన్స్

* రూ.2.44 లక్షల సరుకును గుర్తింపు 
* దుకాణం సీజ్ చేసిన అధికారులు

UPDATED 28th NOVEMBER 2019 THURSDAY 10:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో గల ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి సారా వారి వీధిలోకి వెళ్లే మార్గంలో ఉన్న దొడ్డి వీరభద్రరావు అండ్ సన్స్ ఎరువుల దుకాణంలో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.2.44 లక్షల విలువైన అనధికార ఎరువులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, స్టాక్ బుక్ లో నిల్వలకు, అలాగే ఈపోస్ నిల్వలకు, గ్రౌండ్ బ్యాలెన్స్ లో భారీ తేడాలను గుర్తించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఎసన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం సరుకును సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన సరుకును జేసీ కోర్టుకు అప్పగించనున్నట్లు చెప్పారు. అలాగే షాపును సీజ్ చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడంతోనే తరచూ అవకతవకలు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం హెచ్చరికలు చేసి షాపుల నిర్వాహకులను వదిలేస్తున్నట్టు సమాచారం. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐ సాయి రమేష్, అగ్రికల్చర్ ఆఫీసర్ భార్గవ మహేష్, విజిలెన్స్ డీసీటీవో రత్నకుమార్, మండల వ్యవసాయాధికారిణి కొల్లి ద్వారకాదేవి, ఏఈవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 

ads