నూకాలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

UPDATED 12th MAY 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. పలు స్వచ్చంద సంస్థలు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. పెద్దాపురం సిఐ జి. యువ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ. కృష్ణ భగవాన్ దేవస్థానం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.     

ads