ఎంపీడీవో ఉమామహేశ్వరావుకు ఘన సత్కారం

UPDATED 9th JULY 2019 TUESDAY 9:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా పెద్దాపురం ఎంపీడీవోగా భాద్యతలు నిర్వర్తించి విశాఖ జిల్లాకు బదిలీ అయిన పిడుగు ఉమా మహేశ్వరావును మాజీ ఎంపిపి గుడాల రమేష్, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం ఎంపీడీవో ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ కరక హిమ మహేశ్వరి, కార్యాలయం సూపరింటెండెంట్ విప్పర్తి సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ నాగమణి, హెల్డా, భవాని, లీల, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.         

ads