బడుగుల జీవితాల్లో అంబేద్కర్ వెలుగులు

UPDATED 14th APRIL 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని నింపి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బీఆర్‌. అంబేద్కర్ అని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. పెద్దాపురం మండల పరిధిలోని గుడివాడ, కాండ్రకోట, తదితర గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దూరదృష్టి కలిగిన జాతీయ నేతగా, రాజ్యాంగ విలువలు జాతికి అందించి సామాజిక, ఆర్థిక అంతరాలు లేని సమ సమాజాన్ని నిర్మించిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగంతో రాగద్వేషాలు లేని స్వేచ్ఛను ప్రసాదించిన గొప్ప మానవతావాది అని, నేటి సమాజంలో అంబేద్కర్ ఆలోచనా విధానాలను విస్తృతపర్చడం ద్వారా మాత్రమే సమ సమాజం నిర్మాణమవుతుందని డాక్టర్ చిన్నయ్యదొర ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్, అచ్యుత స్వామి, మణికంఠ, రాజు, నవీన్,రాజు,గంగ, తదితరులు పాల్గొన్నారు

 

ads