ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

UPDATED 11th MARCH 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: ఎంఎల్సీ ఎన్నికల ప్రక్రియలో మైక్రోఅబ్జర్వర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఎమ్మెల్సీ  పోలింగ్ కేంద్రాల మైక్రో అబ్జర్వర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంత రాయుడు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉద్దేశించిన అంశాలను సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడానికి గ్రూపు సి, ఆపైస్థాయి బ్యాంకు ఉద్యోగులను ప్రతీ పోలింగు కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించడం జరిగిందని, వీరు పోలింగు నిర్వహణా ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు, ఓటింగు రహస్యత, పోలింగు ఏజెంట్ల హాజరు, ఓట్లు గుర్తింపు, పోలింగు కంపార్టుమెంట్లు, తదితర అంశాలను పరిశీలించాలని అన్నారు. పోలింగు ముందురోజు సంబంధిత సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని, పోలింగు రోజున కనీసం గంటముందే చేరుకుని ఏర్పాట్లును పరిశీలించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో  నాంచారయ్య, ఎలక్షన్ డిటి రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

ads