జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం

UPDATED 6th MARCH 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని పార్టీ నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. జనసేన-జనబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బుధవారం సాయంత్రం స్థానిక బళ్ళ మార్కెట్ సెంటర్లో జన జాగృతి మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో సిద్ధాంతాలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అలాగే పార్టీ గుర్తు గాజు గ్లాసును ప్రతీ ఒక్కరికీ పంచారు. జనసేనకు ఓటు వేయడం వల్ల రాబోయే తరాలకు భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు వివరించారు.సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పేద ప్రజలకు చేరువ కావాలన్నదే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయమని తెలిపారు. జనసేన మ్యానిఫెస్టో సిద్ధాంతాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు పార్టీలోకి వస్తున్నారని, పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజలు నిలవాలన్నారు. అనంతరం జనసేన సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ కమిటీ వైస్ చైర్మన్ పంతం నానాజీ, కాకినాడ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి అత్తిలి సీతారామస్వామి, పంతం గాంధీమోహన్, తుమ్మల ప్రసాద్, కాకినాడ పార్లమెంటరీ కమిటీ వైస్ చైర్మన్ మధు వీరేష్, అనిశెట్టి బుల్లబ్బాయి, కాకినాడ పార్లమెంటరీ కమిటీ కోకన్వీనర్ పెంకే వెంకటలక్ష్మి,  కాకినాడ పార్లమెంటరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకర కృష్ణవేణి, పిట్టా జానకి రామారావు, శ్రీరంగం ఉదయ్ మార్తాండ ఠాగూర్, సరోజ్ వాసు, నాగబాబు, వీరవెంకట సత్యప్రసాద్, బుచ్చిరాజు, లక్ష్మణ్ దివాకర్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ads