ఓటు వేయడానికి వస్తే చితకొట్టారు

• పెద్దాపురం ఎస్ఐ ఓవర్ యాక్షన్ 
• ఎస్ఐ తీరుపై గ్రామస్థులు ఆందోళన 

UPDATED 8th APRIL 2021 THURSDAY 9:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ  యువకుడిని పెద్దాపురం ఎస్ఐ ఏ. బాలాజీ విచక్షణారహితంగా కొట్టడంతో ఆ యువకుడు చెయ్యి విరిగింది.   పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన బావిశెట్టి స్వామి అనే యువకుడు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందికి తన ఓటరు స్లిప్పును చూపిస్తూ ఎక్కడకి వెళ్లాలని అడుగుతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఎస్ఐ ఆ యువకుడిని లాఠీతో చితక్కొట్టారు. తాను ఓటు వేసేందుకు వచ్చానని చెబుతున్నా వినకుండా తనను తీవ్రంగా కొట్టినట్లు ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. 

ads