తెలుగు మహా సభల్లో మెరిసిన ఫ్రెంచ్ ప్రొఫెసర్

* మాతృభాషలో అధ్యయనంపై ప్రచారం
* రెండున్నరేండ్లు తెలుగు నేర్చుకొన్న ప్రొఫెసర్ డాక్టర్ డేనియల్ నెజర్స్
* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి
UPDATED 17th DECEMBER 2017 SUNDAY 7:00 PM
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాష చదవాల్సిన అవసరాన్నివిస్తృతంగా ఓ ఫ్రెంచ్ ఫ్రొఫెసర్ ప్రచారం చేస్తున్నాడు. తనది విదేశీ భాష అయినా కష్టపడి నేర్చుకుని తెలుగు పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ అనర్గళంగా తెలుగుభాషలోనే మాట్లాడుతూ ఔరా అనిపిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో హాజరయ్యేందుకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు ప్రొఫెసర్ డాక్టర్ డేనియల్ నెజర్స్‌ వచ్చారు. ఈయన 1985లో ఇండో - ఫ్రెంచ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం కోసం ఆంధ్రప్రదేశ్‌ వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఓ ప్రాజెక్ట్ పనిమీద తెలుగు రాష్ర్టాలలో పర్యటించి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ సంస్థలో పనిచేస్తున్నారు. అలాగే  అంతర్జాతీయంగా ఉన్న 93 భాషలను నేర్పించేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆరు భారతీయ భాషలు హిందీ, తమిళ్, ఉర్దూ, బెంగాలీ, తెలుగు భాషలను ఫ్రెంచ్ వారికి నేర్పిస్తున్నారు. గతంలో రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో నివసించి తెలుగు భాషను శ్రద్ధగా నేర్చుకున్నారు. తెలుగు సాహిత్య ప్రక్రియలు, సంస్కృతి, బుర్రకథలు, జానపద సాహిత్యంపై అధ్యయనం చేశారు. వేమన పద్యాలు, చింతామణి కథలను ఫ్రెంచ్‌లోకి అనువందించారు. ప్రతీ ఏటా తెలుగు పీహెచ్‌డీ అభ్యసిస్తున్న విద్యార్థులకు అయన  గైడ్ గా వ్యవహరిస్తున్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us