కరోనా నియంత్రణకు సహకరించండి:ఏఎస్పీ బిందుమాధవ్

రాజవొమ్మంగి: 25 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్ సూచించారు. రాజవొమ్మంగిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను తప్పని సరిగా ధరించాలని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ads