స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి : ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 6 అక్టోబరు 2021; స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని తహశీల్దార్లను ఆర్డీవో పి.వెంకటరమణ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలో ఉన్న తహసీల్దార్లతో బుధవారం సంక్షేమ పథకాలు, రెవిన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ లోని తహశీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత గురించి అడిగి తెలుసుకున్నారు. వీఆర్వోలు చేస్తున్న విధులపై సమీక్షించారు. అలాగే ఈ - క్రాప్ సంబంధించి మండలాల నివేదిక పూర్తిస్థాయిలో తయారుచేసి 14 రోజుల లోపు నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్, పట్టాదార్ పాస్ పుస్తకాలు, పి.ఎల్.ఆర్, ఆధార్ సీడింగ్, రీ సర్వే, ఆక్రమణలు తదితర అంశాలపై మండలాలవారీగా సమీక్షించారు. రెవిన్యూ పరంగా చేయవలసిన పనులను జాప్యం చేయకుండా,పారదర్శకంగా నివేదికను పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం మార్గదర్శకాలను, తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బూసి శ్రీదేవి,ఆర్డీవో కార్యాలయ సిబ్బంది భానూకుమార్,రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us