నిందితులను కఠినంగా శిక్షించాలి

UPDATED 1st DECEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తెలంగాణా రాష్ట్రం శంషాబాద్‌ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి కాల్చి చంపిన నిందితులని కఠినంగా శిక్షించాలని ఐద్వా, సీఐటీయూ, సోషల్ మీడియా ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట ఎస్ఐ వి.యల్.వి.కె. సుమంత్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అత్యవసర సమయాల్లో 100 నెంబరుకు ఫోన్ చెయ్యాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఇంటి నుంచి బైటకు వెళ్లిన తరువాత ఎలా ఉంటున్నారు  అనే విషయాలను పరిశీలించాలని అన్నారు. అత్యవసర సమయాల్లో లిమిట్స్ తో పని లేకుండా కేసు నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా పరిధి పోలీస్ స్టేషన్లకు కేసును బదలాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు ఎ. అమలావతి, కె. వరలక్ష్మి, బాలం లక్ష్మి, సత్యసుందరి, రమణమ్మ, సీఐటీయూ మండల అధ్యక్షులు బర్ల గోపాల్, ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీనివాస్, కరణం శ్రీనివాసరావు, కరణం సత్యనారాయణ, గోవిందరాజు, బాలం సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

ads