కనులపండువగా సీతారామ కల్యాణం

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక  సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. సత్యనారాయణపురానికి చెందిన జి. భాస్కరరావు, శారద దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ముందుగా తిరువారాధన అనంతరం విశ్వక్సేన పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కరతాళ ధ్వనులు, రామనామ స్మరణల నడుమ కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గండి రఘు, పడాల చిట్టిబాబు, సేపేని సురేష్, కౌశిక్, బాలాజీ, విస్సు, స్వామి, అశోక్, వర్రే రవి, మద్దాల శ్రీను, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

ads