ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధ్యం

UPDATED 11th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఐక్యంగా పోరాడితేనే కార్మికులు హక్కులు సాధించుకోవచ్చని సిఐటియు మండల  ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్ అన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ మహాసభ స్థానిక  బ్రౌన్ పేటలో గల అంబేద్కర్ భవనంలో యూనియన్ అధ్యక్షురాలు కె. వరలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు మండల ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అంగన్వాడీ కార్యకర్తకు రూ. 175, హెల్పర్ కి రూ.125 గౌరవ వేతనం తీసుకునే వారని, పోరాటాల వల్ల ప్రస్తుతం కార్యకర్తలు రూ.10500, హెల్పర్స్ రూ.6000 తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న వేతనం ఎంతమాత్రం సరిపోదని, కనీసవేతనం రూ.18   వేలు ఇవ్వాలని అన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సామర్లకోట అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా బాలం శ్రీనివాస్, అధ్యక్షురాలిగా వి. వెంకటలక్ష్మి, కార్యదర్శి ఎ. అమలావతి, ఉపాధ్యక్షురాలిగా కె. వరలక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా ఎ.వి. రమణమ్మ, కార్యవర్గ సభ్యులుగా ఎస్. స్నేహలత, టి. నాగమణి, ఎం.వి. రమణమ్మ, ఎస్. సుజాత, పి. రాజేశ్వరి, కె. రాణి శాంతకుమారి, ఎస్. రత్నం, పి. భూదేవి, టి. మణి, ఎస్. సత్యవతి, పి.బి.ఎస్. ప్రభ, బి. లక్ష్మీ, బి. వెంకటరత్నంలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని గౌరవ అధ్యక్షులు బాలం శ్రీనివాస్ అభినందించారు. 

 

ads