పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో విద్యార్థిని ప్రతిభ

UPDATED 10th MAY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక అయోధ్యరామాపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పరాస్ కుమారి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 722 ర్యాంక్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ తమ పాఠశాల సిబ్బంది సమిష్టి కృషితో పదవ తరగతి ఫలితాలతో పాటు పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్దినిని మున్సిపల్ కమీషనర్ టి. నాగేంద్రకుమార్, ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య, తదితరులు అభినందించారు.

ads