వ్యవసాయ రంగం అభివృద్ధితోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి

UPDATED 8th JULY 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: వ్యవసాయ రంగం అభివృద్ధితోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక రాజుగారివీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏడిఏ ఎం. రత్నప్రశాంతి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రైతులను ఉద్దేశించి ఎంఎల్ఏ చినరాజప్ప మాట్లాడుతూ అన్నదాతల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని, ముఖ్యంగా రైతు ఆర్థికంగా ఎప్పుడు నిలదొక్కుకుంటాడో అప్పుడే వ్యవసాయ రంగం అన్ని విధాలా స్థిరపడుతుందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడే వ్యవసాయ రంగం అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ ప్రత్యేకాధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, బయో కంట్రోల్ ఏడిఏ స్వాతి, ఏవోలు కొల్లి ద్వారకాదేవి, శామ్యూల్ జాన్, వెటర్నరీ ఎడి డాక్టర్ శ్రీనివాసరావు, ఏపిఎంఐపి ఏరియా ఇంఛార్జ్ చిలకమ్మ, ఏఈవో ఎన్.వి.వి. ప్రసాద్, ఎంపీఈవోలు కొల్లి ఉదయ్ కుమార్, షేక్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.                       

ads