ఫిబ్రవరి 17 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

UPDATED 16th FEBRUARY 2020 SUNDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ యర్రం శ్రీనివాసరావు తెలిపారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో గల పెద్దాపురం, రంగంపేట మండలాల్లో గల పశు పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో నీరసించి పోవడం, చూడి పశువులు ఈసుకుపోవడం, ఎద్దులలో పని సామర్ధ్యం, పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, పాలు త్రాగే దూడలు మరణించడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా పశు సంవర్ధక శాఖచే పశువులకు గుర్తింపు క్రింద 12 అంకెలు గల చెవి బిళ్ళను పశువుల చెవులకు వేయడం జరుగుతుందని, దీని ఆధారంగా ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం కల్పించే అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

ads