పరిశ్రమల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు

సామర్లకోట:17 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం,సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను జేసి రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీబీ రహదారిలో ఉన్న రాక్ సిరామిక్స్, రుచి, అపర్గా టైల్స్, నవభారత షుగర్స్ పరిశ్రమలను అధికారుల బృందంతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కావలసిన అన్ని జాగ్రత్తలను యాజమాన్యాలు పాటించాలన్నారు. ప్రమాదాల నివారణకు సిబ్బందితో కలసి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఈ పర్యటనలో జేసీతో పాటు పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ads