ఆదిత్య ప్రొఫెసరుకు డి.ఎస్.టి ప్రాజెక్టు ప్రధానం

UPDATED 11th JUNE 2019 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్విరాన్ మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ వీరవిల్లి సూర్యనారాయణకు ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటరుగా డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డి.ఎస్.టి.) విభాగమైన నేషనల్ సైన్స్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (న్యూఢిల్లీ) నుంచి రూ.32.7లక్షల విలువైన ప్రాజెక్టు గ్రాంట్ పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ సూర్యనారాయణ బిబ్లియోమెట్రిక్ మేపింగ్ ఆఫ్ సోలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్రమ్ 1986-2016 అనే అంశంపై పరిశోధనలు జరిపి పరిశోధనా ఫలితాలను గ్రంథ రూపంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సమర్పించాలని, ఈ ప్రాజెక్టు కాలవ్యవధి రెండు సంవత్సరాలని తెలిపారు. డాక్టర్ సూర్యనారాయణ గత 23 సంవత్సరాలుగా ఎన్విరాన్ మెంటల్ సైన్స్, బయో టెక్నాలజీ, మైక్రో బయోలజీ విభాగాలలో విశేష పరిశోధనలు చేస్తున్నారని, ఇంతవరకు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్, సదస్సులలో 72 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. కె.ఎల్ యూనివర్సిటీలో జిగ్ జిగా యూనివర్సిటీ (ఇథియోపియా)లో ప్రొఫెసరుగా పనిచేశారని, గత ఆరు సంవత్సరాలుగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్విరాన్ మెంటల్ సైన్స్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గ్రాంట్ పొందడం పట్ల ఆదిత్య ఆర్&డి డైరెక్టర్ డాక్టర్ కెవిఎస్ రామచంద్రమూర్తి, తదితరులు ఆయనను అభినందించారు. 

ads