చేనేతలను విస్మరిస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, 11 ఆగస్టు 2021(రెడ్ బీ న్యూస్): చేనేతలను ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు..పట్టణంలో బుధవారం చేనేత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ప్రతి రంగాన్ని మోసం చేసినట్లుగానే చేనేత రంగాన్ని, వారికి సంక్షేమం పేరుతో అప్పటి వరకు అందుతున్న అన్ని పధకాలను రద్దు చేసి మోసం చేస్తున్నారని, కేవలం మగ్గం ఉన్నావారికే అంటూ నిబంధన పెట్టడం ద్వారా అదే రంగంలో నూలు వాడకం, రాట్నం తప్పడం, దారం బొందులు ఎక్కిచండం, రంగుల అద్దకం వంటి పనులు చేసే కార్మికులను వంచిస్తున్నారని ఆరోపించారు. చేనేత సంక్షేమం, ఆర్ధిక స్వాలంబన కోసం చేసిందేమిటి ఆని ప్రశ్నించారు.పైగా రూపాయి రుణం అందించలేదని, గతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 2 లక్షల వరకు రుణాలు అందేవని అన్నారు. అందులో లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చేదని, కానీ రెండేళ్లలో ఒక్కరికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదన్నారు. చేనేత యూనిట్లకు పోత్సాహమూ అందించలేదని విమర్శించారు. గతంలో ఒక్కరికి లక్ష చొప్పున అందిస్తే ప్రస్తుతం అదే లక్షలను నలుగురికి పంచూతూ చేనేత సంక్షేమానికి ఏదో చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో హోరెత్తుస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే వర్షాకాలంలో ఇచ్చే రూ. 8వేలు భృతిని రద్దు చేశారని, నూలు, రంగులపై అందించే సబ్సిడీని విద్యుత్ సబ్సిడీని ఎత్తేశారన్నారు. ఇంకా చేనేత కోసం చేసిందేంటి ఇదేనా చేనేత సంక్షేమం ఇదేనా చేనేతలకు అందించే ఉతం అని రాజప్ప ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ చేనేత కార్మికులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us