భూ రీసర్వే 60 శాతం పూర్తి : ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం,12 ఆగస్టు 2021(రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నిర్వహిస్తున్న భూ రీ సర్వేలో పెద్దాపురం డివిజన్ కు మోడల్ విలేజ్ గా సిరివాడ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ఎంపికైన గ్రామంలో 60 శాతం సర్వే పనులు పూర్తి అయినట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. మండలంలో సిరివాడ గ్రామంలో భూ రీసర్వే మోడల్ విలేజ్ పనులను ఆర్డీవో గురువారం తనిఖీ చేశారు. 60 శాతం రీ సర్వే పనులు పూర్తయినట్లు తెలిపారు. డ్రోన్ లో తీసిన చిత్రాలు ఆధారంగా విలేజ్ టీమ్ సర్వేయర్లు, వీఆర్వోలతో తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వీటిలో చిన్న లోపాలను సవరించి, తిరిగి రైతుల సమక్షంలో రైతులను పొలాల్లో నిలబెట్టి సరిహద్దు నిర్ణయించడం జరిగిందని వీటిలో 34 ఓనర్ షిప్ సరిహద్దులు చిన్న మార్పులు తప్ప పెద్దగా తేడా రాలేదన్నారు. విలేజ్ టీమ్ చెకింగ్ అనంతరం మండలం డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్ చెక్ చేయడం జరిగిందని, అనంతరం ఈ సర్వేను ఆర్డిఓ డిప్యూటీ సర్వే తనిఖీ చేయవలసి ఉందని , ఇందులో భాగంగానే ఈ రోజు చెక్ చేయడం జరిగిందని ,వీటిలో 50 శాతం పని పూర్తి చేసినట్లు తనిఖీలో తేలిందని తెలిపారు . అక్టోబర్ 2 నాటికి సిరివాడ రైతులకు ఆర్ఓఆర్ బదులుగా అత్యాధునికమైన కొత్త టైటిల్ లీడ్ కార్డును ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సర్వే చట్టాన్ని కూడా సవరించి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆర్ డి ఓ తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ బి.శ్రీదేవి,డీఎస్ఓ సాహు, మండల్ సర్వేయర్ సామోరు, వీఆర్వోలు ,రెవెన్యూ ఇనస్పెక్టర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us