రాష్ట్ర ఇబిసి సంక్షేమ సంస్థ చైర్మన్ పదవికి చైతన్యరాజు రాజీనామా

UPDATED 7th JUNE 2019 FRIDAY 9:00 PM

రాజానగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇబిసి సంక్షేమ సంస్థ చైర్మన్ పదవికి కెవివి సత్యనారాయణరాజు (చైతన్యరాజు) రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన విలేఖరులకు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించినట్లు తెలిపారు. తన పదవీ కాలంలో తన పాలనా వ్యవహారాల విషయంలో సహకరించిన అధికార్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.    

ads