మరిడమ్మ అమ్మవారికి వెండి చీర బహూకరణ

UPDATED 13th OCTOBER 2020 TUESDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారికి  ఆలయ వంశపారంపర్య ధర్మకర్త  డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, శేషరత్నం దంపతులు మంగళవారం వెండి చీరను బహూకరించారు. సుమారు మూడు కేజీలు వెండితో తయారు చేయించిన ఈ వెండి చీరను దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మికి వారు అందచేశారు. ముఖ్యమైన పర్వదినాల్లో అమ్మవారికి ఈ వెండిచీరను అలంకరించనున్నట్లు ఈ సందర్భంగా కమీషనర్ పేర్కొన్నారు. 

ads