దేశం గర్వించదగ్గ గొప్పవ్యక్తి అంబేద్కర్

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: దేశం గర్వించదగ్గ గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ అని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక బలుసులపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రతీ ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.       

 

ads