పెళ్లి జంటను ఆశీర్వదించిన మాజీ హోం మంత్రి

UPDATED 7tH FEBRUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణంలో సాక్షి దినపత్రిక విలేఖరిగా పనిచేస్తున్న అడపా వెంకట్రావు కుటుంబాన్ని రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం సాయంత్రం సందర్శించారు. గత నెల 26వ తేదీన వెంకట్రావు రెండవ కుమార్తె వివాహ కార్యక్రమానికి రాజప్ప హాజరు కాని కారణంగా శుక్రవారం సాయంత్రం వెంకట్రావు కుటుంబాన్ని సందర్శించి వధూవరులను దీవించారు. విజయవాడలో అత్యవసర సమావేశం ఉన్న కారణంగా తాను వివాహ సమయానికి హాజరు కాలేక పోయానని ఈ సందర్భంగా చినరాజప్ప తెలిపారు. నూతన వధూవరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, కంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ చిన్ని, దూది రాజు, పడాల వీరబాబు, తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

 

ads