ఆదిత్య అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్మయికి డాక్టరేట్

UPDATED 8th JULY 2019 MONDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ జి.వి.ఎన్. కిరణ్మయి జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు."ఫైటో కెమికల్ అండ్ ఫార్మకొలాజికల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ టెకోమా గౌడి చౌడి, నెప్టూనియా ఒలెరేశియా అండ్ హైబిస్కస్ హెరిటస్ ఫర్ ధైర్ తెరప్యూటిక్ పొటన్షియల్" అనే అంశంపై పరిశోధనకుగాను డాక్టరేట్ పొందారన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో అసోసియేట్ ఫ్రొపెసరుగా సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. ఫార్మసీ కళాశాలల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ మాట్లాడుతూ కిరణ్మయి బిఫార్మసీ, ఎంఫార్మసీలలో ఆంధ్రా యూనివర్సిటీ టాపరుగా నిలిచారని, ఆంధ్రప్రదేశ్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ (హైదరాబాద్) ఉమెన్ యంగ్ సైంటిస్ట్ గా నామినేట్ చేశారని అన్నారు. అలాగే ఆమె వ్రాసిన అనేక రీసెర్చ్, సైంటిఫిక్ పేపర్లు ప్రముఖ ఫార్మసీ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని, ఫార్మసీ కోర్సుకు సంబంధించి మూడు పాఠ్య పుస్తకాలకు సహరచయితగా వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్  నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్, డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, అధ్యాపక సిబ్బంది, తదితరులు డాక్టర్ కిరణ్మయిని అభినందించారు.  
 

 

ads