భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు

UPDATED 11th FEBRUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: వసంత పంచమి శుభఘడియల్లో శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సరస్వతీ అమ్మవారి జన్మదిన వేడుకలకు తరలివచ్చిన అశేష భక్తజనావళితో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఆలయ ప్రాంగణంలో ఆదివారం విద్యార్థులు సామూహిక సరస్వతీ పూజలు నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పంచామృత అభిషేకం, సరస్వతి హోమంతో పాటు తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, సరస్వతి రూపులను దేవస్థానం, దాతల సహకారంతో ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వీర్రాజు దేవి ఫిషరీస్ లిమిటెడ్, తలుపుల అంజనీ కుమార్, బిక్కిన పరమేశ్వర సాయి, సత్యనారాయణ, నోరి కృష్ణారావు, భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, నూతలపాటి పూర్ణచంద్రరావు, మహంకాళి వెంకట గణేష్, కటకం గంగబాబు, చలికి వీరేంద్ర, కొండపల్లి కృష్ణమూర్తి, నిమ్మకాయల రంగనాథ్, హోం మంత్రి పిఏ ఎన్. సుబ్బారావు, ఈవో పులి నారాయణమూర్తి, పడాల వీరబాబు, దూది రాజు, వేద పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కంతేటి భోగరాజు, సన్నిధిరాజు, చెరుకూరి రాంబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads