331 సంఘాలకు రూ.1.45 కోట్లు జమ

గంగవరం:13 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): వైయస్సార్ ఆసరా పథకం ద్వారా మండలంలో 331 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూరుతుందని వెలుగు ఏపీఎం సత్య ప్రసాద్ అన్నారు. మండల మహిళా సమైఖ్య భవనంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మూడు వందల ముప్పై ఒక్క సంఘాలకు రూ.1.45 కోట్లు తొలివిడతగా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కెఎస్ ప్రభాకర్ మండల కన్వీనర్ అప్పలరాజు మండల ఇంచార్జ్ రఘు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు బేబీ రత్నం యువజన అధ్యక్షుడు రమణయ్య జిల్లా నాయకులు గంగాదేవి తదితరులు ప్రసంగించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలను కోరారు. ఈ సందర్భంగా నమూనా పత్రాలను డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ads