స్టాక్ మార్కెట్-వ్యక్తిత్వ వికాసంపై ఆదిత్యలో అవగాహన సదస్సు

UPDATED 15th MARCH 2021 MONDAY 7:30 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో స్టాక్ మార్కెట్-వ్యక్తిత్వ వికాసం అను అంశంపై సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డవలప్మెంట్ ఆఫ్ విమెన్ ప్రతినిధి నూకల భానుమతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వీయ ప్రేరణ, బాహ్య ప్రేరణ, వ్యక్తిత్వ భావోద్వేగ మేధస్సు, సంకల్పం, అంకితభావం విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరేంత వరకు  కష్టించి పనిచేసే స్వభావాన్ని అలవరచుకోవాలి అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు వివిధ రంగాలలో ప్రముఖులచే ఉపన్యాసాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఆదిత్య విద్యా సంస్థల తరుపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, బిబిఏ, ఎంబిఏ విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.

ads