రెవెన్యూలో కలప దొంగలు

*పాత ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయ భవనాల కలప మాయం
*రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తరలింపు
*సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ఆరోపణలు
*ఉద్యోగుల పాత్రపైనే అనుమానాలు
* జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

UPDATED 21st AUGUST 2021 SATURDAY 11:00 AM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన రెవిన్యూ ఉద్యోగులు లక్షలాది రూపాయల విలువ చేసే టేకు, మద్ది, గుగ్గిలం (సిల్వర్), తదితర మేలు జాతి కలప దుంగలను దశలవారీగా మాయం చేసిన ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో నిర్మించిన తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయ భవనాలను గత ప్రభుత్వం తొలగించి నూతన భవనాలను నిర్మించిందని, ఆ భవనాలను తొలగించగా వచ్చిన కలపను ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనం వెనుక, అలాగే పాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిల్వ ఉంచారన్నారు. రెవిన్యూ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ కలపను భారీ వాహనాల్లో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారని  పేర్కొన్నారు. భవనాలు తొలగించి సుమారు నాలుగు సంవత్సరాలు గడిచినా వచ్చిన కలపను కనీసం బహిరంగ వేలం వేయకపోవడంతో ఆ కలప అన్యాక్రాంతం అయిపోయిందని, అలాగే వచ్చిన కలప ఎంత అనే విషయం కూడా రిజిస్టర్‌లో పొందుపరిచిన దాఖలాలు కూడా లేవన్నారు. రెవిన్యూ శాఖలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు తమ సొంత అవసరాలకు కూడా ఆ కలపను వినియోగించుకున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయని, కలపను అప్పుడే బహిరంగ వేలం వేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరి ఉండేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
*కలప మాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి
కలప మాయంపై విచారణ జరిపించాలి. అలాగే భవనాలను కూల్చివేయగా వచ్చిన కలపను మాయం చేసింది ఎవరనేది తేల్చాలి. కలపకు బహిరంగ వేలం వేసి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరి ఉండేది. కలప మాయం కావడానికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి.
గుణ్ణం లక్ష్మణరావు
చైర్మన్
ఫర్ ది పీపుల్ ఫౌండేషన్
పెద్దాపురం.

  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us