పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

UPDATED 11th JUNE 2019 TUESDAY 10:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌ను ఒక ప్రేమజంట మంగళవారం ఆశ్రయించింది. పెద్దలను కాదని వారిరువురూ దేవాలయంలో పెళ్లి చేసుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పెద్దాపురం పట్టణానికి చెందిన తోట నవీన్‌, విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామానికి చెందిన ఎస్‌. రమ్య రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించారని తెలిసి వారు నేరుగా సామర్లకోట పట్టణంలో గల ఒక  దేవాలయంలో పెళ్లి చేసుకుని  పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అలాగే ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు.

ads