హమాలీల నిరసన

సామర్లకోట,28 ఏప్రిల్ 2020(రెడ్ బి న్యూస్): రైల్వే స్టేషన్ లోని గూడ్స్ వ్యాగన్ యార్డ్ వద్ద దిగుమతి హమాలీలు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనకు దిగారు.సుమారు మూడు గంటల పాటు ఈనిరసన కొనసాగింది.నిరసనలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పాల్గొని యాజమాన్యం, కూలీలతో చర్చలు జరిపారు.సామర్లకోటలో దిగుమతి కోసం గూడ్స్ వ్యాగన్ ద్వారా వచ్చిన గోధుమల లోడును దిగుమతి చేయాల్సి ఉండగా హమాలీలు తమకు నూతన వేతన ఒప్పందం ప్రకారం కూలి రేట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యార్డు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.దానితో కార్మిక యూనియన్ మధు విచ్చేసియాజమాన్యం, కూలీలతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా శ్రీలలితా ఇండస్ట్రీస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించాయి. చివరకు టన్ను రూ. 53,000 చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దానికి ఇరువర్గాల అంగీకారానికి రాగా మూడు గంటల తర్వాత హమాలీలు దిగుమతి విధులకు పూనుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్డి సత్యనారాయణ,జిల్లా కోశాధికారి బోడకొండ సాయి తదితరులు పాల్గొన్నారు..
ads