మహాశివరాత్రి ఉత్సవాలకు రాట ముహూర్తం

UPDATED 8th FEBRUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పనులు ప్రారంభించే నిమిత్తం శుక్రవారం రాట ముహూర్తం పూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో పులి నారాయణమూర్తి ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ రాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.           

ads