అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

UPDATED 5th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ స్థానిక అర్బన్ ఐసిడిఎస్ సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వి. వెంకటలక్ష్మి, ఏ. అమరావతి మాట్లాడుతూ మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు విద్యాహక్కు కల్పించాలని, అంగన్వాడీ కార్యకర్తలను గ్రేడ్ 3, సహాయకులను  గ్రేడ్-4 ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని అన్నారు. 45వ ఇండియన్ లేబర్ కమీషన్ సిఫార్సుల ప్రకారం  స్కీమ్ వర్కర్లుగా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వల్ల అంగన్వాడీ కేంద్రాల మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సిడిపివో పద్మావతికి వినతిపత్రం   అందచేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి, రమణమ్మ, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు. 

ads