భక్తి శ్రద్ధలతో చండీహోమం

UPDATED 29th DECEMBER 2020 TUESDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర శుద్ధ పౌర్ణమి తిథి సందర్భంగా మంగళవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటని, లోక కళ్యాణార్ధం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్ సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోందని ఈ సందర్భంగా వేద పండితులు చండీ హోమం విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం అమ్మవారికి  ఉయ్యాల సేవ, అలాగే దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మీ, వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads