అగ్ని ప్రమాద బాధితులకు సాయం

UPDATED 18th OCTOBER 2020 SUNDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో రాజు గారి బీడు ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన భాదితులకు ఉమా శంకర సేవా సంఘం ఆధ్వర్యంలో సాయం అందించారు. బాధితులైన కట్టా వెంకట లక్ష్మి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, బట్టలు అందచేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు జీను వెంకటరమణ (జేవీఆర్) మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, అలాగే అభాగ్యులను ఆదుకునేందుకు ఉమా శంకర సేవా సంఘం అనే స్వచ్చంధ సేవా సంస్థను ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు తమవంతు సహకారాన్ని సంఘం తరుపున అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మేలిం వెంకన్నబాబు, సభ్యులు తుమ్మలపల్లి సుబ్బారాయుడు, తుమ్మలపల్లి దుర్గాప్రసాద్, వెంకన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads