థాయిలాండ్ తెలుగు సాంస్కృతిక నృత్యోత్సవాల్లో ఆకట్టుకున్న ప్రసాద్ నృత్య ప్రదర్శనలు

UPDATED 7th SEPTEMBER 2019 SATURDAY 5:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : విఘ్నరాజాధిపతి వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహెూత్సవాలు సందర్భంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక నృత్యోత్సవాల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ ఇచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈనెల మూడవ తేదీన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలోని సఫారీ వరల్డ్ లో నిర్వహించిన సాంస్కృతిక నృత్యోత్సవాల్లో ఆయన పాల్గొని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. విజయవాడకు చెందిన విశ్వభారతీ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు కూచిపూడి విశ్వం బృందంతో కలిసి ప్రసాద్ హాజరయ్యారు. అలాగే తనతోపాటు వాగ్గేవి కూచిపూడి నృత్యాలయ గురువు సప్పా శివకుమార్, శశి చందన, సాయిశిరీష, అంజుమాలిక పాల్గొని నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులు కూచిపూడి విశ్వం, సప్పా శివకుమార్ లకు ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నృత్యకారుడు ప్రసాద్ పలు రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వేదికలపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ అనేక ఆవార్డులను కైవసం చేసుకొంటున్న విషయం విదితమే. థాయిలాండ్ తెలుగు సాంస్కృతిక నృత్యోత్సావాల్లో పాల్గొని సత్కారం పొందిన నృత్యకారుడు అలమండ ప్రసాద్ ను అక్కడి తెలుగు అసోసియేషన్ నిర్వాహకులు, సఫారీ మేనేజర్ ధర్మేంద్రతో పాటు పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కంచి మహా సంస్థానం పీఠం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, భారత్ మాతా సేవా ఫరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), సెవెన్ హిల్స్ పేపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పసల పద్మరాఘవరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చాగంటి సన్యాసిరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు, వీరభద్రా జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్రప్రసాద్ (ఆస్ట్రో ప్రసాద్) తదితరులు అభినందించారు.  

 

ads