నాణ్యతతో పనులు చేపట్టాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య 

UPDATED 23rd JUNE 2020 TUESDAY 7:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న మన బడి నాడు-నేడు పనులు అత్యంత నాణ్యతతో నిర్వహించాలని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య  కార్యనిర్వాహక ఇంజనీర్లను ఆదేశించారు. గంగవరం మండలంలో కుసుమ రాయి, ఏటిపల్లి, ఎండపల్లి, సూరంపాలెం, రాములదేవపురం ఎంపీపీ పాఠశాలలను మంగళవారం సందర్శించి నాడు-నేడు ద్వారా చేపడుతున్న తొమ్మిది రకాల అభివృద్ధి సూచికల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. అలాగే గంగవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మల్లేశ్వరరావు, సర్వశిక్ష అభియాన్ జేఈఈ వెంకటేశ్వరరావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ads