పెద్దాపురం ఎస్ఐగా బాలాజీ బాధ్యతలు స్వీకరణ

UPDATED 25th JUNE 2020 THURSDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై పెద్దాపురం ఎస్ఐగా వచ్చిన ఏ. బాలాజీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన వెలుగుల సురేష్ ను విఆర్ లో పెట్టడంతో ఆయన స్థానంలో ఈయన ఇక్కడకు వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సిఐ జయకుమార్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 

 

ads